Telangana Govt : భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు - ఈ జిల్లాలకు కొత్త కలెక్టర్లు, ప్రభుత్వం ఉత్తర్వులు

2 years ago 660
ARTICLE AD

తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Govt : భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు - ఈ జిల్లాలకు కొత్త కలెక్టర్లు, ప్రభుత్వం ఉత్తర్వులు

IAS Transfers in Telangana : రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు శనివారం తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఐఎఎస్ అధికారుల బదిలీలు

IAS Transfers in Telangana : తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో పని చేస్తున్న పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులను జారీ చేసింది. మొత్తం 20 మంది అధికారులు బదిలీ అయ్యారు. ఇందులో ఎక్కువగా కలెక్టర్లు ఉన్నారు.

మంచిర్యాల జిల్లా కలెక్టర్ గా ఉన్న బడావత్ సంతోష్ ను నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ గా నియమితులయ్యారు.సందీప్ కుమార్ ఝా - రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా నియమితులయ్యారు.అశిష్ సంగ్వాన్ - కామారెడ్డి జిల్లా కలెక్టర్ గా నియామకం.వీ. పాటిల్ - భదాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గా నియామకం.రాహుల్ శర్మ - భూపాలపల్లి జిల్లా కలెక్టర్ గా నియామకం.సిక్తా పట్నాయక్ - హన్మకొండ కలెకర్ట్ గా ఉండగా...నారాయణపేట జిల్లా కలెక్టర్ గా నియమించారు.శ్రీ హర్ష - పెద్దప్లలి జిల్లా కలెక్టర్ గా నియామకం.ప్రావీణ్య - వరంగల్ జిల్లా కలెక్టర్ గా ఉండగా... హన్మకొండ కలెక్టర్ గా నియామకం.బీ సత్యప్రసాద్ - జగిత్యాల జిల్లా కలెక్టర్ గా నియామకం.విజేంద్ర - మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ గా నియామకం.కుమార్ దీపక్ - మంచిర్యాల జిల్లా కలెక్టర్ గా నియామకం.ప్రతీక్ జైన్ - వికారాబాద్ జిల్లా కలెక్టర్ గా నియామకం.నారాయణ రెడ్డి - నల్గొండ కలెక్టర్ గా నియామకం.ఆదర్శ సురభీ - వనపర్తి జిల్లా కలెక్టర్ గా నియామకం.శారదా దేవీ - వరంగల్ జిల్లా కలెక్టర్ గా నియామకం.అభినవ్ - నిర్మల్ కలెక్టర్ గా నియామకం.
Read Entire Article
💬 Chat